Breaking News

అటవీ అధికారులపై దాడి.. ఐదుగురి అరెస్ట్

హాజీపూర్ తండాలో ఘటన.. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు

ఎల్లారెడ్డి, అక్టోబరు 13 (E6tv న్యూస్ ప్రతినిధి).

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తండా పరిధిలో విధులు నిర్వహిస్తున్న అటవీ అధికారులపై దాడికి పాల్పడిన కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎల్లారెడ్డి పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబరు 30న హాజీపూర్ అటవీ ప్రాంతంలో అటవీ బీట్ అధికారులు నాయకోటి శ్రీనివాస్, ప్రదీప్ విధులు నిర్వహిస్తుండగా, హాజీపూర్ తండాకు చెందిన కొందరు వ్యక్తులు వారి విధులకు ఆటంకం కలిగించి దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా కేసులో నిందితులుగా పేర్కొన్న హాజీపూర్ తండాకు చెందిన సబావత్ గంగారం, సబావత్ దేవుల, సబావత్ దేవీసింగ్, సబావత్ గోవింద్‌తో పాటు మరో వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

— E6tv NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *