Breaking News

అత్తాపూర్‌లో అర్ధరాత్రి పోకిరీల హల్‌చల్..

హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిగల చింతల్‌మెట్ డీమార్ట్ చౌరస్తా వద్ద అర్ధరాత్రి వేళ పోకిరీల ఆగడాలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మోడిఫైడ్ కార్లతో మైనర్ యువకులు రోడ్లపై అతివేగంగా నడుపుతూ, ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు నిరంతరం ‘చబుత్రా మిషన్’తో పాటు అర్ధరాత్రి వాహన తనిఖీలు చేపడుతున్నప్పటికీ ఈ పోకిరీల హంగామా ఆగడం లేదని, అధికారుల పర్యవేక్షణ లోపించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న ఇలాంటి ర్యాష్ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్‌ను స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *