విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతో పాటు ఇంధన వినియోగంలో పొదుపు పాటించడం ద్వారానే పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన 25వ CII ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్-2026కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం అంటే మరో కొత్త విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పడంతో సమానమని పేర్కొన్నారు. సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ఇంధన వినియోగంలో మరింత సమర్థత సాధించవచ్చని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలు, పెట్టుబడులకు ఎంతో అనుకూలమైన ప్రాంతమని, సంపద సృష్టికర్తలకు ప్రభుత్వం ఎల్లవేళలా స్వాగతం పలుకుతుందని చెప్పారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వెల్లడించిన ఆయన, అందులో భాగంగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఇంధన పొదుపే మరో విద్యుత్ కేంద్రం: CII సమ్మిట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

