Breaking News

బ్యాంకుల్లో 5-డే వర్కింగ్ అమలు చేయాలి: కవిత మద్దతు

బ్యాంక్ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని, లేదంటే బ్యాంకులను వారమంతా తెరిచి ఉద్యోగులకు షిఫ్ట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని కోరారు. పనిభారం, నిరంతర ఒత్తిడి ఎదుర్కొంటున్న బ్యాంకింగ్ సిబ్బంది డిమాండ్ ఎంతగానో న్యాయమైనదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం రెండవ, నాల్గవ శనివారాలు మాత్రమే సెలవులు పొందుతున్న ఉద్యోగుల కోసం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సుదీర్ఘ పోరాటం చేస్తోందని గుర్తుచేశారు. ఆర్‌బీఐ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మరియు బీమా సంస్థల్లో ఇప్పటికే 5 రోజుల పని విధానం అమలవుతున్నందున, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ సిఫారసుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐలు త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *