పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో గురజాల అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు మాక్ ఆపరేషన్ నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు జరిగినప్పుడు శాంతిభద్రతలను ఎలా కాపాడాలి, పరిస్థితులను ఎలా అదుపులోకి తీసుకురావాలనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీచార్జ్ వంటి చర్యలను పోలీసులు ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపించారు. అత్యవసర పరిస్థితుల్లో సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడమే ఈ మాక్ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాచర్ల టౌన్, రూరల్ సీఐలు, ఎస్‌ఐలు మరియు స్పెషల్ పార్టీ పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మాచర్లలో అల్లర్ల కట్టడిపై పోలీసుల మాక్ ఆపరేషన్
