ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి అవసరాల కోసం రూ.120 కోట్లతో పాటు, ఇతర జిల్లాల తక్షణ అవసరాలకు ఒక్కో దానికి రూ. కోటి చొప్పున నిధులు మంజూరు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మంత్రి.. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో అద్దె బోరుబావులు, ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు ఇంకుడు గుంతల ద్వారా భూగర్భంలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
- Adilabad
- Hyderabad
- Karimnagar
- Khamam
- Mahaboobnagar
- Medak
- Medchal
- Nalgonda
- News
- Nizambad
- Ranga Reddy
- Telangana
- Warangal
ఎల్‌నినో ఎఫెక్ట్.. తాగునీటి కోసం రూ.120 కోట్లు!
