Breaking News

రాప్తాడు ఘటన బాధితురాలి తల్లికి సీఎం చంద్రబాబు ఫోన్.. భరోసా!

అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో విద్యార్థినులపై ఇటువంటి దాడులకు పాల్పడే ఉన్మాదులకు సమాజంలో చోటు లేదని ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. గాయపడిన విద్యార్థిని ఆరోగ్యాన్ని తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య బృందాన్ని ఆదేశించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, చట్టప్రకారం అత్యంత కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *