Breaking News

రాప్తాడు పాఠశాల దాడి కేసు: ధర్మవరంలో ఉన్మాది అరెస్ట్!

అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్ (21)ను పోలీసులు శనివారం ధర్మవరం రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి దూరపు బంధువైన నిందితుడు క్లాస్‌రూమ్‌లోకి ప్రవేశించి ఈ పాశవిక దాడికి పాల్పడగా, తీవ్రంగా గాయపడిన బాలికను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిపై చట్టప్రకారం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *