Breaking News

యశోద హాస్పిటల్స్ అత్యాధునిక యూరాలజీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సేవలు

నిజామాబాద్ ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలపై కొత్త భరోసా

నిజామాబాద్, అక్టోబర్ 28 (E6 TV న్యూస్).

కిడ్నీ వ్యాధులు, ప్రోస్టేట్ సమస్యలు, మూత్రనాళ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న నిజామాబాద్ జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు మరింత చేరువయ్యాయి. కిడ్నీ మార్పిడి (ట్రాన్స్‌ప్లాంటేషన్) సహా సంక్లిష్ట యూరాలజీ చికిత్సలను హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉన్నాయని సీనియర్ కన్సల్టెంట్ రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ జి. మధుసూదన్ రెడ్డి తెలిపారు.యూరాలజీ సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు రోగులు త్వరగా కోలుకునే అవకాశాలు మెరుగుపడతాయని ఆయన వివరించారు.

లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు

కిడ్నీలో రాళ్లు, ప్రోస్టేట్ గ్రంథి వాపు, మూత్ర విసర్జనలో ఇబ్బందులు వంటి సమస్యలకు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని డాక్టర్ మధుసూదన్ రెడ్డి సూచించారు. తీవ్రమైన నొప్పి, మూత్రంలో రక్తం పడటం, తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రం ధార తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి లేజర్ చికిత్సలు, మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీలు వంటి ఆధునిక వైద్య విధానాలు ఉపయోగపడతాయని తెలిపారు.

క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం కీలకం

కిడ్నీ, మూత్రాశయం, ప్రోస్టేట్ క్యాన్సర్లను ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా తగిన చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. లాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జరీల్లో వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎంపిక చేసిన రోగులకు తక్కువ కోతలతో శస్త్రచికిత్స చేసే అవకాశాలు ఉన్నాయని వివరించారు. రోగి ఆరోగ్య పరిస్థితి, వ్యాధి స్వభావం, క్యాన్సర్ దశ ఆధారంగా చికిత్సా విధానాన్ని నిర్ణయిస్తామని చెప్పారు.

చివరి దశ కిడ్నీ వ్యాధికి ట్రాన్స్‌ప్లాంట్ కీలకం

చివరి దశ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగులకు తగిన సందర్భాల్లో కిడ్నీ మార్పిడి సమర్థవంతమైన చికిత్సా మార్గమని డాక్టర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. కిడ్నీ మార్పిడికి ముందు దాత, గ్రహీత ఆరోగ్య పరిస్థితులను సమగ్రంగా పరిశీలించడంతో పాటు, వారి మధ్య అనుకూలతను నిర్ధారించి, అవసరమైన చట్టపరమైన అనుమతులు పొందడం తప్పనిసరి అని వివరించారు.నిజామాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కిడ్నీ, మూత్ర సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా నిపుణుల సలహా తీసుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను అవసరాన్ని బట్టి వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ గత మూడు దశాబ్దాలుగా వివిధ వైద్య విభాగాల్లో సేవలు అందిస్తోంది. ఆధునిక వైద్య సాంకేతికత, రోగనిర్ధారణ పద్ధతులు, ప్రత్యేక వైద్య విభాగాల ద్వారా సంక్లిష్ట వ్యాధులకు చికిత్స అందించడంపై సంస్థ దృష్టి సారిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *