Breaking News

చెన్నై తీరంలో భారీగా చైనా క్రాకర్స్ లభ్యం!

చెన్నై పోర్టు ద్వారా నిషేధిత చైనా బాణాసంచాను అక్రమంగా దేశంలోకి దిగుమతి చేసుకునేందుకు స్మగ్లర్లు వేసిన పెద్ద ప్లాన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు భగ్నం చేశారు. స్టేషనరీ, మెడికల్ గ్లోవ్స్, హెయిర్ బ్యాండ్స్, వార్డ్‌రోబ్‌లు మరియు షూ రాక్స్ ఉన్నట్లు తప్పుడు డిక్లరేషన్ పేపర్లు సృష్టించి కంటైనర్లను రవాణా చేస్తుండగా, పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన డీఆర్‌ఐ అధికారులు కార్టన్ పెట్టెల వెనుక దాచి ఉంచిన సుమారు రూ. 12 కోట్లకు పైగా విలువైన బాణాసంచాను సీజ్ చేశారు. అనుమతులు లేకుండా కస్టమ్స్ తనిఖీల కన్నుగప్పి సరుకును దేశంలోకి రప్పించేందుకు ప్రయత్నించిన ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌పై అధికారులు తీవ్ర దృష్టి సారించారు. చైనా నుంచి ఈ బాణాసంచాను ఎవరు ఆర్డర్ చేశారు, కంటైనర్ల క్లియరెన్స్ వెనుక ఎవరెవరున్నారు అనే కోణంలో డీఆర్‌ఐ సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *