పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎడ్లపాడు జెడ్పీటీసీ అభ్యర్థి బుల్లబ్బాయిని ఆమె నివాసంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో రజని బయటకు వచ్చి నిలదీశారు. ఈ సందర్భంగా చిలకలూరుపేట రూరల్ ఎస్ఐ ప్రియాంక, విడదల రజనికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎస్ఐ అడ్డుకునే క్రమంలో జరిగిన తోపులాటలో రజని కిందపడిపోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రజని, అనంతరం తన మద్దతుదారులతో కలిసి నిరసనకు దిగారు.
మహిళా పోలీసుతో విడదల రజనిని తోపులాట…!
