Breaking News

జవహర్‌నగర్‌ డంపింగ్ యార్డ్‌ను తరలించాలి.. ఈటల రాజేందర్

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ తరలింపు డిమాండ్‌తో బీజేపీ ఉద్యమానికి సిద్ధమవుతోంది. దమ్మాయిగూడలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అధ్యక్షతన, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా బీజేపీ సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ, డంపింగ్‌ యార్డ్ దుర్వాసన మరియు లీచేట్‌ కాలుష్యం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర శ్వాసకోశ, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, చెరువులు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను వాడాలని, శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 25న రౌండ్‌టేబుల్‌ సమావేశం, 27న భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించగా, అవసరమైతే జవహర్‌నగర్‌లో సకల జనుల సమ్మె చేపడతామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *