ఎల్లారెడ్డి, అక్టోబర్ 23 (E6tv న్యూస్).
నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం కొక్కొండ గ్రామంలో సారీ ఫంక్షన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన ముత్యం కుమార్తెలు సౌమ్య, స్పందన, సాత్వికల సారీ ఫంక్షన్ శుక్రవారం వారి నివాసంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో సందడిగా జరిగింది.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎల్లారెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి చిన్నారులను ఆశీర్వదించి, వారి భవిష్యత్తు సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు చెన్నంగారి శ్రీనివాస్ రెడ్డి, పరందాములు, జైపాల్ రెడ్డి, సంతోష్ పాటిల్, ఆఫీస్ పటేల్, ధనవత్ రాజు, నీల రవి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొని చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు.

