బెంగళూరులోని ఓ పబ్‌లో పోలీసులపై దురుసుగా ప్రవర్తించి, దాడికి యత్నించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (KADA) ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి వికాస్ మార్మత్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంది.
అక్టోబర్ 10న బెంగళూరులోని రెసిడెన్సీ రోడ్డులో ఉన్న ఒక బార్ అండ్ రెస్టారెంట్లో జరిగిన తనిఖీల సమయంలో.. 2019 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి వికాస్ మార్మత్, ఆయన స్నేహితులు పోలీసు విధులకు ఆటంకం కలిగించి, అధికారులపై అసభ్య పదజాలంతో దూషించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది.
ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ ఘటనపై విచారణ జరిపిన ప్రభుత్వం.. వికాస్ మార్మత్ను తక్షణమే ప్రాజెక్ట్ డైరెక్టర్ పదవి నుంచి బదిలీ చేస్తూ, తదుపరి పోటింగ్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (GAD)లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

