Breaking News

CEC వ్యతిరేక ఆందోళన.. ఇమ్రాన్ ఖాన్‌కు అక్టోబర్ 28 డెడ్‌లైన్!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు షాక్ ఇచ్చారు. అక్టోబర్ 28లోగా భారతదేశాన్ని వదిలి వెళ్లిపోవాలని ఆదేశిస్తూ ‘లీవ్ ఇండియా’ (Leave India) నోటీసులు జారీ చేశారు.

ముంబైలోని ఆగస్టు క్రాంతి మైదాన్‌లో విదేశాంగ చట్టాలను ఉల్లంఘించి నిరసనలో పాల్గొన్నారనే ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్‌పై ఇమ్మిగ్రేషన్ చట్టంలోని సెక్షన్లు 29, 7 కింద పోలీసులు చర్యలు చేపట్టారు. అమెరికన్ పాస్‌పోర్ట్, ఓసీఐ (OCI) కార్డు కలిగిన ఇమ్రాన్ ఖాన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఆందోళనలో పాల్గొనడమే కాకుండా మీడియాతో మాట్లాడారు. భారత పౌరుడు కాకపోయినప్పటికీ రాజకీయ నిరసనల్లో పాల్గొని వీసా నిబంధనలను ఉల్లంఘించారంటూ బీజేపీ నేత కిరీట్ సోమయ్య ఇచ్చిన ఫిర్యాదు, సమర్పించిన ఆధారాల మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఆందోళన సందర్భంగా పోలీసులు ఇమ్రాన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకోగా, తాను ఏ రాజకీయ పార్టీ తరఫున రాలేదని, నగరంలో పౌరుల హక్కులు, స్వేచ్ఛను ఎందుకు అణచివేస్తున్నారో తెలుసుకోవడానికే ఒక సాధారణ నివాసిగా ఇక్కడికి వచ్చానని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *