Breaking News

కారట్‌లేన్ జ్యువెలరీ చోరీ రూ. 7 కోట్లు దోచేసారు!

హైదరాబాద్ శివార్లలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కారట్‌లేన్ (CaratLane) జ్యువెలరీ షోరూమ్‌ను టార్గెట్ చేసిన దుండగులు, షట్టర్‌ను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. షాపులో ఉన్న సుమారు 7 కోట్ల రూపాయల విలువైన బంగారం, వజ్రాభరణాలను దొంగిలించి పరారయ్యారు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించడంతో పాటు షోరూమ్‌లోని నిఘా కెమెరాలు (CCTV) మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లోని దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *