కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అధికారిక పర్యటనలు హఠాత్తుగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఇవాళ, రేపు ఆయన ఛత్తీస్గఢ్లో పర్యటించి ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష నిర్వహించాల్సి ఉండగా, ఆ కార్యక్రమాలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై విపక్ష పార్టీలు, పలు వర్గాలు దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేసిన నేపధ్యంలో ఈ పర్యటన వాయిదా పడటం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నిర్ణయానికి విపక్షాల ఆందోళనలే కారణమా లేదా ఇతర పరిపాలనాపరమైన అంశాలు ఉన్నాయా అన్న దానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
ఆందోళనల వేళ సీఈసీ నిర్ణయం: పర్యటనలు రద్దు
