Breaking News

SIR పేరుతో ఓట్ల తొలగింపును నిరసిస్తూ కాంగ్రెస్ ర్యాలీ

వర్ని, అక్టోబర్ 7: (E6tv NEWS ప్రతినిధి).
SIR పేరుతో ఓట్లలో అవకతవకలకు పాల్పడుతూ అర్హులైన ఓటర్ల ఓట్లను తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ విధానాన్ని నిరసిస్తూ బుధవారం వర్ని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా జాతీయ CEC జ్ఞానేశ్వర్ తీరును నిరసిస్తూ నాయకులు నినాదాలు చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమంగా ఓట్ల తొలగింపు జరుగుతోందని ఆరోపిస్తూ, దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కల్పించాలని, ఓటర్ల జాబితాలో పారదర్శకత పాటించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వర్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ బాబా, మైనార్టీ నాయకులు భారీ, పీఏసీఎస్ అధ్యక్షులు సాయిబాబా, నేమాని వీర్రాజు, రంజ్యా నాయక్, గంగా ప్రసాద్, రవి, మద్దిపూడి శ్రీను, బలరాంతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *