గుజరాత్ ముఖ్యమంత్రిగా మరియు దేశ ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉదయం వర్చువల్‌గా ‘వికసిత్ భారత్ సంకల్ప్ సభ’ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ‘వికసిత్ భారత్ @ 2047’ లక్ష్య సాధన కోసం ఆయన దేశప్రజలతో సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నారు. ప్రధాని ప్రసంగానికి ముందు బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రసంగించనుండగా, అనంతరం గుజరాత్‌వ్యాప్తంగా ‘సేవా జ్యోతి కలశ యాత్ర’ను ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 17న ప్రారంభమైన దేశవ్యాప్త ‘సేవా సంకల్ప్ యాత్ర’ కూడా నేటితో ముగియనుండగా, ప్రధాని జన్మస్థలమైన వాద్‌నగర్‌లోని చారిత్రక హత్కేశ్వర్ మహాదేవ్ ఆలయంలో జలాభిషేకంతో పాటు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు.
ప్రజాసేవలో ప్రధాని మోదీ 25 ఏళ్లు పూర్తి…’వికసిత్ భారత్ సంకల్ప్ సభ’లో ప్రసంగం
