Breaking News

పాలనలో ఉద్యోగులదే కీలక పాత్ర: సీఎం రేవంత్!

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమగ్ర కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించి, ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన సీఎం, పేదల సమస్యల పరిష్కార వేదికలుగా కలెక్టరేట్ కార్యాలయాలు ఉపయోగపడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో 10.5 లక్షల మంది ఉద్యోగులే కీలక ప్రతినిధులని, ప్రభుత్వంపై ప్రజల్లో మంచి లేదా చెడ్డ అభిప్రాయం ఏర్పడటానికి ఉద్యోగుల పనితీరే కారణమని వ్యాఖ్యానించారు.

అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.810 కోట్ల నిధులను సాధించుకున్నామని సీఎం వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తే అభినందించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలని, మిగతా సమయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *