Breaking News

కేసీఆర్ కడితే.. రేవంత్ రిబ్బన్లు కట్ చేస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి కేవలం ఒక ‘రిబ్బన్ కటింగ్ సీఎం’ అని ఎద్దేవా చేసిన ఆయన, గతంలో కేసీఆర్ నిర్మించిన కట్టడాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రారంభిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి, కరీంనగర్ కలెక్టరేట్ కేసీఆర్ ఆనవాళ్లు కాదా అని సూటిగా ప్రశ్నించారు.

సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అభివృద్ధిలో కనీసం 10 శాతమైనా ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో చేసి చూపించాలని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి సొంత గ్రామంలోనే విద్యుత్ సరఫరా సరిగా లేదని విమర్శించారు. రాబోయే రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, అప్పుడు కాంగ్రెస్ పాలనకు ముగింపు పలికి గాంధీ భవన్‌కు పంపుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *