Breaking News

రెవెన్యూ సేవలు సకాలంలో అందించాలి

పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: ధర్మవరం ఆర్డీఓ ఓ. రామ భూపాల్ రెడ్డి

చెన్నేకొత్తపల్లి, సెప్టెంబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి).
ప్రజలకు రెవెన్యూ సేవలను నిర్ణీత గడువులోగా అందించాలని ధర్మవరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఓ. రామ భూపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం డివిజన్ పరిధిలోని చెన్నేకొత్తపల్లి మండల కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా మండల కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆర్డీఓ.. పెండింగ్ దరఖాస్తులు, పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులు, ఆర్‌ఓఆర్, మ్యూటేషన్ వ్యవహారాలు, రీసర్వే పనులు, భూ సంబంధిత సమస్యల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో నిర్వహిస్తున్న రికార్డులు, రిజిస్టర్లు, ఇతర ముఖ్యమైన దస్త్రాల నిర్వహణను పరిశీలించారు.

పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి నిబంధనల ప్రకారం సత్వర పరిష్కారం చూపాలని సూచించారు. రీసర్వే పనులను వేగవంతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు.

రీసర్వేలో నాణ్యత, ఖచ్చితత్వం పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని తెలిపారు. కార్యాలయ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి, ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా రెవెన్యూ సేవలు అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ తనిఖీలో తహసీల్దార్ సురేష్ కుమార్, ఆర్‌ఐ, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *