ప్రారంభోత్సవంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్
పటాన్చెరు, అక్టోబర్ 17 (E6tv న్యూస్).
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలో గౌడ హాస్టల్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర టాడీ టాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గౌడ హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు, విద్యార్థులకు ఉపయోగపడేలా హాస్టల్ భవనం అందుబాటులోకి రావడం పట్ల సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గౌడ సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
