Breaking News

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

దసరా నేపథ్యంలో రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

కోరుట్ల, అక్టోబర్ 17 (E6tv న్యూస్).

దసరా పండుగ నేపథ్యంలో పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐ కొమ్ము తిరుపతి మాట్లాడుతూ.. పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకునేలా చూడటం పోలీసుల ప్రధాన బాధ్యతని పేర్కొన్నారు. పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రవర్తించినా, గొడవలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని, పోలీసుల సూచనలను పాటిస్తూ శాంతియుత వాతావరణానికి సహకరించాలని సూచించారు.

పండుగల సమయంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటుందని సీఐ తిరుపతి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *