ఎమ్మెల్యే మదన్ మోహన్ చొరవతో 1, 2వ వార్డుల్లో ప్రారంభమైన పనులు
ఎల్లారెడ్డి, అక్టోబర్ 24 (E6tv న్యూస్).
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 1, 2వ వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు మదన్ మోహన్ చొరవతో చేపట్టిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత వార్డుల కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, లబ్ధిదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేసుకునే అవకాశం లభిస్తోందని పేర్కొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని సూచించారు.పేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
