Breaking News

డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే కఠిన చర్యలు!

వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్లు వాడుతున్న వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. కుల్సుంపుర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేతిబౌలి జంక్షన్ వద్ద గోల్కొండ ట్రాఫిక్ ఏసీపీ డి. ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్లలో మాట్లాడుతూ పట్టుబడిన దాదాపు 40 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు.

అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన వారందరికీ పోలీసులు అక్కడే ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి, రోడ్డు భద్రతా నియమాలు పాటించేలా అవగాహన కల్పించారు. డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడకం తీవ్రమైన ఏకాగ్రత లోపానికి దారితీస్తుందని, దీనివల్ల పెను ప్రమాగాలు జరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రయాణంలో తమతో పాటు తోటి ప్రయాణికుల ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *