ఎత్తొండ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌గా కోనేరు వెంకట సుబ్బారావు

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘన సన్మానం.. రైతులకు మెరుగైన సేవలు అందించాలని విజ్ఞప్తి

బాన్సువాడ, అక్టోబర్ 16:(E6tv  ప్రతినిధి).

ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) చైర్మన్‌గా నియమితులైన కోనేరు వెంకట సుబ్బారావును ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ఇన్‌చార్జి సోంపూర్ పోచిరాం మాదిగ, జలయ మాదిగతో పాటు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సంఘరి సాయిలు, నాగరాజు మాదిగ కలిసి ఆయనను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పోచిరాం మాదిగ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన ఎరువులు, డీఏపీ, సబ్సిడీ విత్తనాలు సకాలంలో అందేలా నూతన పాలకవర్గం కృషి చేయాలని కోరారు. రైతులకు అవసరమైన రుణాలు, ఇతర వ్యవసాయ సంబంధిత సహాయ సహకారాలు అందించి వారి అభ్యున్నతికి తోడ్పడాలని సూచించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ అవసరాలను గుర్తించి, పాడిపంటలు సమృద్ధిగా పండేలా సహకార సంఘం ద్వారా మెరుగైన సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు.

రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కోరుతూ కోనేరు వెంకట సుబ్బారావుతో పాటు నూతన పాలకవర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *