కోటగిరి, అక్టోబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి).
కమ్యూనిస్టు పార్టీ జిల్లా నాయకుడు అంబటి విఠల్ గౌడ్ తల్లి లచ్చవ్వ ఇటీవల మృతి చెందడంతో MRPS నాయకులు గురువారం కోటగిరి మండల కేంద్రంలో వారి కుటుంబాన్ని పరామర్శించారు. లచ్చవ్వ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా MRPS జిల్లా నాయకుడు సోంపూర్ పోచిరాం మాదిగ, మండల అధ్యక్షుడు కే. పోశెట్టి పండు మాదిగ, హస్కుల శ్రీకాంత్ మాదిగ, కన్నం నితిన్ గైక్వాడ్, గంగాధర్ తదితర నాయకులు అంబటి విఠల్ గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.లచ్చవ్వ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నాయకులు, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని కల్పించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, లచ్చవ్వకు జోహార్లు అర్పించారు.
