జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మతసామరస్యానికి నిదర్శనంగా నిలిచే అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామానికి చెందిన ఎస్.కె. మల్సూర్ – హలీమా దంపతులు స్వామివారిని దర్శించుకుని సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నరసింహస్వామిని దర్శించుకోవడం వల్ల తమకు శుభం కలిగి, సుఖశాంతులతో ఉంటున్నామని, అందుకే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆలయానికి వస్తున్నామని సదరు దంపతులు తెలిపారు. మతాలు వేరైనా భక్తి, నమ్మకం మనుషులను ఏకం చేస్తాయని చాటిచెప్పిన ఈ దృశ్యం స్థానిక భక్తులను విశేషంగా ఆకట్టుకోగా, పలువురు వారి సౌభ్రాతృత్వాన్ని అభినందించారు.
లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ముస్లిం దంపతుల పూజలు:ధర్మపురి
