Breaking News

నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీకి నూతన కార్యవర్గం

జిల్లాలో తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు.. ప్రశాంత వాతావరణంలో పోలింగ్

ఎన్నికల అధికారిగా జిల్లా కో-ఆపరేటివ్ అధికారి శ్రీనివాసరావు

చైర్మన్‌గా పోతంకర్ లక్ష్మీనారాయణ.. వైస్ చైర్మన్‌గా ఈ.సీనా నాయక్

ట్రెజరర్‌గా కెంపుల నాగరాజు.. స్టేట్ MC సభ్యుడిగా అనిల్ కుమార్

నిజామాబాద్: అక్టోబర్ 5: (E6tv NEWS: శివ ఠాకూర్).

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖలో తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. జిల్లా శాఖకు సంబంధించిన ఎన్నికల్లో పోలింగ్ నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

జిల్లా కో-ఆపరేటివ్ అధికారి శ్రీనివాసరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించగా, ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. మొత్తం 15 మంది సభ్యులతో మినిట్స్ బుక్‌లో సంతకాల ద్వారా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు.

ఈ ఎన్నికల్లో పోతంకర్ లక్ష్మీనారాయణ (7632) చైర్మన్‌గా, ఈ. సీనా నాయక్ (2240) వైస్ చైర్మన్‌గా, కెంపుల నాగరాజు (7870) ట్రెజరర్‌గా ఎన్నికయ్యారు. అలాగే స్టేట్ MC సభ్యుడిగా అనిల్ కుమార్ (115) ఎన్నికయ్యారు.

జిల్లా అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తాం

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తూ, అవసరమైన సందర్భాల్లో ప్రజలకు సేవలు అందించడంలో ముందుంటామని హామీ ఇచ్చారు.ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడంతో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖలో కొత్త కార్యవర్గం ఏర్పడిందని, ఇకపై సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని సభ్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *