Breaking News

ఇండియాలో స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్…భారత్‌తో ఇన్వెస్ట్మెంట్ ఒప్పందాలు

భారత్‌లో మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం విచ్చేసిన స్విట్జర్లాండ్ సమాఖ్య అధ్యక్షుడు గై పార్మాలిన్, న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశమయ్యారు. ఉన్నత స్థాయి వ్యాపార, అధికారిక బృందంతో వచ్చిన ఆయనకు అంతకుముందు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీలు ఘన స్వాగతం పలికారు. భారత్ మరియు యురోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA) మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంలో జరిగిన ఈ భేటీలో.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పారిశ్రామిక సహకారం, విజ్ఞాన సాంకేతికత, డిజిటల్ పరిశోధనలు మరియు నైపుణ్య వనరుల మార్పిడిపై ఇరుదేశాలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. EFTA కూటమిలో భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న స్విట్జర్లాండ్‌తో సంబంధాలు మరింత బలపడటానికి ఈ పర్యటన ఎంతగానో తోడ్పడుతుందని ఇరు నాయకులు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *