Breaking News

పిల్లల సోషల్‌ మీడియా వినియోగంపై ఆంక్షలు?

దేశంలోని ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా పిల్లలకు ఇంటర్నెట్‌ను ఉపయోగించడం, యాక్సెస్ చేసుకోవడం అనేది ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 19(1)(A) కింద ఇది ప్రతి పౌరుడికి వర్తిస్తుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. పిల్లల రక్షణ, వారి స్వేచ్ఛ అనేవి ఒకదానికొకటి వ్యతిరేకం కాదని, రెండింటినీ సమన్వయం చేసుకోవాలని అభిప్రాయపడింది.

సోషల్ మీడియా ఖాతాల కోసం ‘చైల్డ్ మోడ్’:

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పిల్లల భద్రతను పెంపొందించేందుకు, వారిని ప్రమాదకర కంటెంట్ నుండి రక్షించేందుకు ప్రత్యేకంగా ‘చైల్డ్ మోడ్’ (Child Mode) ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆన్‌లైన్ వేదికలపై పిల్లల సంరక్షణకు తగిన కఠిన చర్యలు తీసుకోవాలని టెక్ కంపెనీలను ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *