Breaking News

యుపిఐ ఛార్జీలపై ఆర్‌బీఐ గవర్నర్ క్లారిటీ

అక్టోబర్ 15 నుంచి రూ.2,000 దాటిన ఎంపిక చేసిన వ్యాపార యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలు చేయనున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం లావాదేవీల పరిమాణంపై పెద్దగా ప్రభావం చూపదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. బుధవారం నాటి ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం లావాదేవీల్లో ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదని, స్వల్పంగా విధించే ఈ రుసుము వినియోగాన్ని దెబ్బతీయదని అభిప్రాయపడ్డారు. ఈ చార్జీలు కేవలం వ్యాపారులకే వర్తిస్తాయని, సాధారణ వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదని, అలాగే వ్యక్తుల మధ్య జరిగే (P2P) బదిలీలు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని ప్రభుత్వం మరియు ఆర్బీఐ పునరుద్ఘాటించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *