Breaking News

టీడీపీ సింగిల్ విండో చైర్మన్ ముట్టమ్ ప్రభాకర్ కారు దగ్ధం

తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం కురవపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ సింగిల్ విండో చైర్మన్ ముట్టమ్ ప్రభాకర్ కారును అర్ధరాత్రి సమయంలో దుండగులు దగ్ధం చేశారు. నలుగురు వ్యక్తులు పెట్రోల్ క్యాన్లతో వచ్చి, సీసీ కెమెరాలను పక్కకు తిప్పి మరీ కారుకు నిప్పు పెట్టినట్లు గుర్తించారు. మాజీ చైర్మన్ సహదేవ రెడ్డి అవినీతిని గతంలో వెలికి తీయడం వలనే కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఈ దాడికి పాల్పడ్డారని ప్రభాకర్ ఆరోపించారు. నామినేషన్ల సమయంలో తమను భయభ్రాంతులకు గురిచేసేందుకే కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *