Breaking News

నరసరావుపేట నామినేషన్ల వద్ద ధర్నాకు దిగిన గోపిరెడ్డి

పల్నాడు జిల్లా నరసరావుపేటలో స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అభ్యర్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ‘మాట తప్పిన నరసరావుపేట పోలీసులు’ అంటూ వైసీపీ శ్రేణులు పెద్దెత్తున నినాదాలు చేశారు. వైసీపీ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసే వరకు తమ నిరసనను విరమించేది లేదని గోపిరెడ్డి స్పష్టం చేశారు. దీంతో నామినేషన్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *