పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామానికి చెందిన కూటమి ఎంపీటీసీ అభ్యర్థిగా పసుపులేటి నారాయణ తన నామినేషన్ను దాఖలు చేశారు. నడికుడి సచివాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో ఆయన తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. నామినేషన్ సందర్భంగా గామాలపాడు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, ఆయనతో పాటు కూటమి నేతలు జంగా సురేష్, జంగా సైదులు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు. నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
కూటమి అభ్యర్థిగా పసుపులేటి నారాయణ నామినేషన్

