Breaking News

వికారాబాద్‌లో దొంగల హల్‌చల్… రైతులకు భారీ నష్టం!

వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలం చిట్టిగిద్ద గ్రామంలో గత రాత్రి దొంగలు విజృంభించి గ్రామ శివారులోని పొలాల్లో ఉన్న 30కి పైగా బోర్ మోటార్ల కేబుల్ వైర్లను ఎత్తుకెళ్లారు. గత మూడు నెలలుగా మండలంలోని ధాతాపూర్, కేశవపల్లి, పుల్మామిడి గ్రామాల్లోనూ వరుసగా ఇదే తరహా చోరీలు జరుగుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న కొద్దిపాటి నీటితో పంటలను కాపాడుకుందామంటే, ఈ కేబుళ్ల చోరీ వల్ల మోటార్లు నడవక పంటలు ఎండిపోతున్నాయని బాధిత రైతులు వాపోతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపిన గ్రామస్తులు, అధికారులు వెంటనే స్పందించి నిఘా పెంచి దొంగలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *