హైదరాబాద్‌లోని గాంధీ భవన్ (ఇందిరా భవన్) వేదికగా టీపీసీసీ లీగల్ సెల్ కార్యవర్గ సమావేశం ఘనంగా ప్రారంభమైంది. టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ అశోక్ గౌడ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎంపీ మధు యాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రాంమోహన్ రెడ్డి మరియు పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు, లీగల్ సెల్ కార్యవర్గ సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. పార్టీ న్యాయ విభాగం బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు గాను కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఒకే వేదికపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గాంధీ భవన్‌లో టీపీసీసీ లీగల్ సెల్ సమావేశం!
