Breaking News

టెస్ట్ క్రికెట్‌లోకి మళ్లీ రా!: విరాట్‌కు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పిలుపు

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై భారత మాజీ కెప్టెన్, 1983 వరల్డ్ కప్ విజేత కపిల్ దేవ్ స్పందించారు. వెస్ట్ ఇండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ అజేయంగా 139 పరుగులు చేసిన తీరును ప్రశంసించిన కపిల్, ప్రస్తుత వయసులోనూ అతని ఫిట్‌నెస్ అద్భుతంగా ఉందన్నారు. ఈ ఫిట్‌నెస్‌తో కోహ్లీ మరో రెండు మూడేళ్లు టెస్టుల్లో సులువుగా ఆడగలడని, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ టెస్టుల్లోకి రావాలని సూచించారు.

టెస్ట్ రిటైర్మెంట్ నిర్ణయంపై కొన్ని సంవత్సరాల తర్వాత కోహ్లీ కచ్చితంగా బాధపడతారని కపిల్ వ్యాఖ్యానించారు. ఆటపై అంతటి ప్యాషన్, సామర్థ్యం ఉన్నప్పుడు ఇంకాస్త ఎక్కువ కాలం టెస్టులు ఆడాల్సిందని అభిప్రాయపడ్డారు. క్రికెట్‌లో కోహ్లీ సీనియర్ ప్లేయర్ అని, తుది నిర్ణయం అతనిదే అయినప్పటికీ ఒక మాజీ క్రికెటర్‌గా, అభిమానిగా కోహ్లీని మళ్లీ టెస్టు క్రికెట్‌లో చూడాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అలాగే వన్డేల్లో ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే అన్ని రికార్డులను తిరగరాస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *