Breaking News

బ్యాంక్ ఖాతాల్లో రూ. 3 కోట్లు… కోర్టును ఆశ్రయించిన ఐబొమ్మ రవి!

హైదరాబాద్: సినిమా పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ మాజీ అడ్మినిస్ట్రేటర్ ఇమ్మడి రవి (ఐబొమ్మ రవి) తన బ్యాంక్ ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. పైరసీ కేసు విచారణలో భాగంగా పోలీసులు సీజ్ చేసిన తన ఖాతాల్లోని నిధులను తిరిగి విడుదల చేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

గతంలో ఐబొమ్మ పైరసీ కేసులో అరెస్ట్ అయిన రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే విచారణ ప్రక్రియలో భాగంగా పోలీసులు ఆయనకు చెందిన ఆస్తులతో పాటు బ్యాంక్ డిపాజిట్లను స్తంభింపజేశారు (ఫ్రీజ్ చేశారు). బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ కావడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, కుటుంబాన్ని పోషించడం కూడా కష్టంగా మారిందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వివిధ ఖాతాల్లో ఉన్న రూ. 3 కోట్ల నిధులను అన్‌ఫ్రీజ్ చేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై నాంపల్లిలోని 9వ అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *