రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 800 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ శ్రీశాల శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారు రథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వగా, వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ రథోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
సిరిసిల్లలో వైభవంగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం
