Breaking News

వరంగల్‌లో E6TV ఎక్సలెన్స్ అవార్డ్స్.. ముఖ్య అతిథిగా కలెక్టర్

వరంగల్ హంటర్ రోడ్డులోని శ్రీ భద్రకాళి ఫంక్షన్ హాల్‌లో E6TV ఆధ్వర్యంలో ‘హ్యూమన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026’ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరై, వివిధ రంగాల్లో విశేష సేవలందించిన జర్నలిస్టులు, సామాజిక సేవకులు, పారిశుధ్య కార్మికులు, కళాకారులు మరియు ట్రాన్స్‌జెండర్లకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజానికి సేవ చేస్తున్న వారిని గుర్తించి సత్కరించడం గొప్ప విషయమని, ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయని అభినందించారు. E6TV మీడియా ఛానల్ సమాజ హితం కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *