త్వరలో డ్రాఫ్ట్ బిల్లు ప్రజల ముందుకు.. ఎంపీ ధర్మపురి అరవింద్
కాంగ్రెస్‌ను ఖతం చేస్తాం.. బీఆర్ఎస్ను భూస్థాపితం చేస్తాం
బీజేపీ అధికారంలోకి వస్తే క్వింటాల్ పసుపు రూ.50 వేలు దాటిస్తా
నిజామాబాద్, నవంబర్ 26: (E6tv NEWS: శివ ఠాకూర్).
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లు రెండూ కలిసి జరుగుతాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లు త్వరలో ప్రజల ముందుకు వస్తుందని, అది ఏ విధంగా ఉంటుందో చూడాలని పేర్కొన్నారు.
కృష్ణా, గోదావరి జలాల తరలింపునకు కేసీఆర్‌దే పాపమని ఎంపీ అరవింద్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన కోటి ఓట్లు, 90 సీట్ల స్లోగన్ వినడానికి బాగుందని, అయితే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని వ్యాఖ్యానించారు.రేవంత్ రెడ్డికి పాలన చేతకాదని, కేసీఆర్ అసమర్థుడని విమర్శించారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే క్వింటాల్ పసుపు ధర రూ.50 వేలు దాటిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఖతం చేస్తామని, బీఆర్ఎస్ను భూస్థాపితం చేస్తామని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.నిజామాబాద్‌లో మీడియా మిత్రులకు ఇచ్చిన సమాచార సందర్భంలో తన అభిప్రాయాన్ని ఎంపీ అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
