Breaking News

కార్తీక పౌర్ణమి సందర్భంగా నీలకంఠేశ్వర స్వామికి కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు

ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా – కల్వకుంట్ల కవిత

నిజామాబాద్, నవంబర్ 25: (E6tv NEWS).

కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని కార్తీక పౌర్ణమి రోజున దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్తీక మాసం మరుసటి రోజు స్వామివారికి అభిషేకం చేయడం తమ కుటుంబ ఆనవాయితీ అని, అందులో భాగంగానే ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో మరికొన్ని అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని అర్చకులు తన దృష్టికి తీసుకువచ్చారని కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ బిడ్డగా ఆలయ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు బాధ్యతగా ముందుకు వచ్చిన యువతను కల్వకుంట్ల కవిత అభినందించారు. ఆలయ పరిశుభ్రతను తమ బాధ్యతగా తీసుకున్న యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *