Breaking News

మౌలాన్ ఖేడ్‌లో ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు

అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ పుట్ల చంద్రశేఖర్

ఎల్లారెడ్డి, నవంబర్ 25: (E6tv NEWS).

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మౌలాన్ ఖేడ్ గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు కార్యక్రమాన్ని సర్పంచ్ పుట్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రజలకు అందించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పుట్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ, గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వెంకటలక్ష్మి, జీపీఓ రాజు, 6వ వార్డు సభ్యుడు కుసులకంటి సాయిలు, గ్రామస్తుడు తిరుపతి సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *