40 మంది డిగ్రీ, ఎంబీఏ విద్యార్థులకు స్కూల్ బ్యాగుల అందజేత
పటాన్చెరు, నవంబర్ 18: (E6tv NEWS).
దివ్యాంగ విద్యార్థుల విద్యాభ్యాసానికి అండగా నిలుస్తూ ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పటాన్చెరు మాజీ సర్పంచ్, ఎండీఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సేవా స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఇటీవల తేజ్ శ్రీ ఫౌండేషన్ ఫర్ డిసేబుల్డ్ సంస్థకు చెందిన విద్యార్థులు మాదిరి పృథ్వీరాజ్ కార్యాలయాన్ని సందర్శించి తమ అవసరాలను వివరించారు. విద్యార్థుల విజ్ఞప్తికి స్పందించిన పృథ్వీరాజ్ ఈ విషయాన్ని ఎండీఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు మధు దృష్టికి తీసుకెళ్లి అవసరమైన సహాయం అందించాలని కోరారు.
దీంతో పృథ్వీరాజ్ చొరవతో ఎండీఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు మధు, ఫౌండేషన్ సభ్యులతో కలిసి మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఆనంద్‌బాగ్ పరిధి విమలాదేవి నగర్లో ఉన్న తేజ్ శ్రీ ఫౌండేషన్ ఫర్ డిసేబుల్డ్ సంస్థను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ విద్యనభ్యసిస్తున్న డిగ్రీ, ఎంబీఏ కోర్సులకు చెందిన 40 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు.తేజ్ శ్రీ ఫౌండేషన్ ఫర్ డిసేబుల్డ్ సంస్థ దివ్యాంగులు, దృష్టిలోపం కలిగిన విద్యార్థులు, అనాథలు, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు విద్య, నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తోంది.
మాదిరి దేవేందర్ రాజు సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ విద్యార్థుల అవసరాలను గుర్తించి, వారి విద్యాభ్యాసానికి తోడ్పాటు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.



