రూ.15 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
సదాశివపేట మున్సిపాలిటీలో ఏఈ రాజేశ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి శివారెడ్డి పట్టివేత
సంగారెడ్డి, నవంబర్ 26: (E6tv NEWS).లంచం తీసుకుంటూ ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో కాంట్రాక్టర్ నుంచి రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఏఈ రాజేశ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి శివారెడ్డిని పట్టుకున్నారు.
కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన సదాశివపేట మున్సిపాలిటీలో కలకలం రేపింది.మున్సిపల్ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
