అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు, కూటమి నాయకులకు కృతజ్ఞతలు
చెన్నేకొత్తపల్లి, నవంబర్ 26: (E6tv NEWS).
చెన్నేకొత్తపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి, మాజీ బీఎస్ఎఫ్ జవాన్ వడ్డే శ్రీనివాసులు అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించారు.
ఈ సందర్భంగా వడ్డే శ్రీనివాసులు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఓటు హక్కును వినియోగించి అత్యధిక మెజార్టీతో గెలిపించిన చెన్నేకొత్తపల్లి పంచాయతీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఒక మాజీ బీఎస్ఎఫ్ జవాన్‌గా తనను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి, విజయం సాధించే వరకు అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కూటమి నాయకులకు, పార్టీ కుటుంబ సభ్యులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.తన గెలుపు కోసం వివిధ గ్రామాల నుంచి, పట్టణాల నుంచి వచ్చి ఓటు వేసిన మహిళలకు, విద్యార్థులకు, యువతకు, ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
తన గెలుపు కోసం వివిధ గ్రామాల నుంచి, పట్టణాల నుంచి వచ్చి ఓటు వేసిన మహిళలకు, విద్యార్థులకు, యువతకు, ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, చెన్నేకొత్తపల్లి గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రతి ఒక్కరి సంక్షేమమే లక్ష్యంగా, ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని సంకల్పంతో ముందుకు సాగుతానని తెలిపారు.
తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, చెన్నేకొత్తపల్లి పంచాయతీ ప్రజలందరినీ కలుపుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగుదామని వడ్డే శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

