Breaking News

నషా ముక్త్ భారత్ పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్‌పాల్

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. క్రీడలు, వ్యాయామం, పుస్తకాల వైపు అడుగులు వేయాలి

డ్రగ్ టెర్రరిజాన్ని తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – ఎమ్మెల్యే ధన్‌పాల్

హైదరాబాద్ , నవంబర్ 27;(E6tv NEWS).మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో చేపట్టిన నషా ముక్త్ భారత్ పాదయాత్రలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాల వైపు కాకుండా వ్యాయామం, క్రీడలు, పుస్తకాల వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాశ్చాత్య దేశాలు భారత్‌లోని యువతను డ్రగ్ టెర్రరిజం వైపు మళ్లించాలని చూస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదకర ధోరణిని తిప్పికొట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ప్రధానంగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా మార్గనిర్దేశం చేయాలని సూచించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన నషా ముక్త్ భారత్ పాదయాత్ర బృహత్తర కార్యక్రమమని, యువతలో మత్తు పదార్థాలపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం నిజంగా స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *