ఓటర్ల నమోదు కోసం ఇచ్చే ‘ఫామ్-6’ (Form 6) లో నిబంధనలకు విరుద్ధంగా చేసిన మార్పులను కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఎట్టకేలకు తొలగించింది. కేంద్ర చట్టసభలు లేదా కేంద్ర న్యాయశాఖ ఆమోదం లేకుండా ఓటర్ల దరఖాస్తు రూపంలో ‘ప్రత్యేక సాంద్రత సవరణ’ (SIR) కు సంబంధించిన వివరాలు, పూర్వీకుల ఓటర్ సమాచారాన్ని కోరే కొత్త డిక్లరేషన్ను ఈసీఐనెట్ (ECINET) పోర్టల్లో చేర్చడం వివాదాస్పదమైంది.
దీనిపై ఈసీ కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. న్యాయశాఖ అనుమతి లేకుండా రాజ్యాంగబద్ధమైన ఫామ్లను మార్చడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. కమిషనర్ల ఆక్షేపణల అనంతరం, ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన రాష్ట్రాల్లోని ఈసీఐనెట్ పోర్టల్ నుంచి ఆ నిబంధనను ఈసీ తొలగించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 ప్రకారం ఓటర్ నమోదు లేదా సవరణ ఫామ్లలో మార్పులు చేసే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది.
